పదునెక్కుతున్న..పల్లె ఆణిముత్యాలు
ఇవో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావు. ఒకటి.. రెండు..
మూడు.. నాలుగు.. పదీ అంటూ గొంతు చించుకొని
అరిచే కార్పోరేట్ ర్యాంకులూ వీళ్లకు రావు. కానీ
అస్తమానం పుస్తకం.. పుస్తకమంటూ కుస్తీపడుతుంటారు.
పైగా అమ్మానాన్న చెప్పే పనుల్ని కూడా పట్టించుకోరు.
పిల్లల కోసం పేరెంట్స్ కేబుల్ కనెక్షన్ తీసేస్తుంటారు.
మెదడుకు మంచి చేసే ఆహారమే ఇస్తున్నారు.
పిల్లలతో పాటు తల్లిదండ్రులూ అర్ధరాత్రి వరకు
మెలకువ ఉంటుంటారు. ఊర్లకు వెళ్లడం లేదు.
ఉత్సవాలు జరుపుకోవడం లేదు.
రాయిలో దాగివున్న రమణీయ శిల్పాన్ని వెలికితీస్తే..
ఆ రాయి గొప్పతనం తెలుస్తుంది.
మట్టిలో దాగివున్న ఆణిముత్యాల్ని వెలికితీస్తే..
ఆ మట్టికున్న విలువ తెలుస్తుంది.
ఓ శిల్పాన్ని.. ఓ మాణిక్యాన్ని తయారు చేసేందుకు
ఓ దశ.. దిశ ఉంటుంది. విద్యార్థులకు అయితే
ఆ దశ పదో తరగతి. ఫైనల్ పరీక్షల సమయంలో
వాళ్లు సానబడుతూ.. సమరానికి సిద్ధమవుతున్నారు!
వారిని తయారు చేయడంలో ప్రైవేట్ స్కూళ్లే కాదు..
పల్లెటూరి ప్రభుత్వ బడులూ ముందున్నాయి!

సర్కారీ విద్యను సార్ధకత చేసేందుకు ప్రభుత్వం
కేజీ టు పీజీ కోసం రూ.258.89 బడ్జెట్ కేటాయిస్తే..
పల్లె ఆణిముత్యాల్ని వెలికితీసేందుకు
జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ వంటి సంస్థలు
స్పెషల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాయి!
మా అమ్మాయికే ఎక్కువ మార్కొలొస్తాయని ఒకరు..
మావాడైతే రోజంతా చదవుతున్నాడని ఇంకొకరు
ఓ నెల రోజుల్నుంచి చాలా
వింతవింతగా ప్రవర్తిస్తున్నారెందుకు?
జీవితంలో పైకి రావాలంటే పదో తరగతి
చదవాల్సిందేనా? ఫైనల్ ఎగ్జామ్స్‌లో మంచి స్కోర్
చేస్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుందా? ఎందుకింత
పోటీ.. ఏమిటీ పదో తరగతి పరీక్షలకున్న గొప్పతనం?
సర్కారు బడిలో చదివే విద్యార్థుల దమ్మేంటి?
సంస్కార వంతులు అమ్మ ఒడిలో నడకను.. నడతను
నేర్చిన శిశువులో అంతర్లీనంగా ఉన్న దివ్యత్వాన్ని
వెలికితీసే సంస్కార కేంద్రం బడి. ఒకప్పుడు బడి
అంటే ప్రభుత్వ పాఠశాలే! ప్రభుత్వ పాఠశాలల్లో
చదివే పిల్లలకు మార్కులే కాదు.. మానవ సమాజ
నిర్మాణ పునాదుల గురించి మిగతావాళ్లకంటే ఎక్కువ
జ్ఞానం కలిగి ఉండే సంస్కారవంతులుగా వీళ్లను
చెప్పవచ్చు. ్రపతిభా కుసుమాలునేడు పల్లెల్లోని
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థికంగా.. సామాజికంగా
పేదరికం అనుభవిస్తున్నవాళ్లే చదువుతున్నారు.
వీరిలో ప్రతిభకు కొదువ లేదు. అయితే ఆ ప్రతిభా
కుసుమాల ప్రతిభను సరైన సమయంలో
గుర్తించి చేయూతనిస్తే ఫలితం ఉంటుంది.
గ్రామీణ విద్యార్థుల వికాసానికై కృషి
చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలు బతుకుతాయి.
యుద్ధ సైనికులు
పరీక్షలప్పుడే పాస్ మార్కుల కోసం కాకుండా
ప్రతీ విషయం పట్ల కొంత అవగాహన వీళ్లకుంటుంది.
అందుకే తెలంగాణ పల్లెల్లోని ఏ గ్రామంలో చూసినా
ఈ ఆణిముత్యాలు గత ఆర్నెళ్ల నుంచి
లక్ష్యంగా చదువుతున్నారు. యుద్ధం కోసం చూసే
సైనికుల్లా పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు.
పోటీలో నెగ్గేలా శ్రమిస్తున్నారు.
ఇప్పుడు మిగిలింది తుది సమరమే! ఈ తుది
సమరంలో విజయం సాధించేందుకు సైనికుల
వలె సిద్ధంగా ఉన్నారు వాళ్లు. . రివిజన్లు..
రివ్యూలు సైతం ముగించుకొని ఫైనల్
పరీక్షలో సత్తా చాటేందుకు పోటాపోటీగా చదువుతున్నారు.
పదో తరగతి పదనిసలు!
రంగారెడ్డిజిల్లా.. ఇబ్రహీంపట్నం మండలం
గురుకుల విద్యాపీఠ్ కేంద్రం. ఆహ్లాదకరమైన
వాతావరణం.. ప్రశాంత పరిస్థితి. తపస్సులు చేసే
మునులను తలపిస్తున్నారు. ఒకరికొకరు పరిచయం లేరు.
కానీ నువ్వా నేనా అనేట్లు పోటీ పడి చదువుతున్నారు.
ఎవరు వీళ్లంతా అంటే.. వీళ్లే పదోతరగతి తుది పరీక్షల
కోసం ప్రిపేరవుతున్నవాళ్లు. ఒకటికాదు.. రెండుకాదు
నలభై రోజులుగా ఉన్నఊరుకు.. కన్నవాళ్లకు దూరంగా
ఉండి పదిలో రాణించేందుకు పదునెక్కుతున్న
పల్లె ఆణిముత్యాలు! వీళ్లంతా ఓ లక్ష్యం కోసం
పనిచేస్తున్నారు. వీళ్లెవరూ సంపన్నులు కాదు.
అంతా పేద కుటుంబాల నుంచి వచ్చినవారే.
వీళ్లను చూస్తుంటే పదో తరగతి పరీక్షల
కోసం ప్రిపేరవుతున్నవాళ్లలా కనింపించడం లేదు.
జీవిత పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.
పక్కా ప్రణాళికా ప్రకారం.. రోజులో దాదాపు
14 గంటలు చదువుకే కేటాయిస్తూ సివిల్స్
శిబిరాలను తలపిస్తున్నారు. అందుకే
వీళ్లను సంస్కారవంతులుగా.. ప్రతిభా కుసుమాలుగా..
యుద్ధ సైనికులుగా పేర్కొనాల్సి వస్తోంది!
పేదరికం అడ్డురావొద్దని!
జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ పల్లెల్లోని ప్రభుత్వ
పాఠశాలల పునరుజ్జీవనం కోసం నడుంకట్టింది.
ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా
ఈ సంస్థ ఫౌండర్ సదా వెంకట్‌రెడ్డి ఈ అంశంపై
బాగా స్టడీ చేశారు. ప్రతిభావంతుడైన ఏ పిల్లవాడూ
పేదరికం కారణంగా ప్రతిభను కోల్పోవద్దు అనేదే తన
లక్ష్యంగా పెట్టుకొని పల్లె ఆణిముత్యాలను
వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు. విద్యా విధానం
బాగున్నా.. మనలోని అనాసక్తుల వల్ల
ఎందరో ప్రతిభావంతులకు కొంతమేర నష్టమే
జరిగినా తద్వారా సమాజానికి మాత్రం
తీరనిలోటు ఏర్పడుతుందని నమ్మకతప్పని నిజం.
అందుకే వీళ్లను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే
దేశప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు
తమలాంటి ప్రతిభావంతులనెందరినో తీర్చిదిద్దుతారు.
వారికి మనం అందించే ఆత్మీయ ప్రోత్సాహం వారి
జీవితాల్లో వెలుగులు నింపి.. తమ ప్రాంత ప్రతిభా
రూపాలను ప్రోత్సహించి అభివృద్ధికి.. ప్రగతికి బాటలు
వేస్తారు అనే బలీయమైన నమ్మకంతో..
ఆత్మవిశ్వాసంతో ఈ ముందడుగు వేసినట్లు
ఆయన చెప్తున్నారు.
అవకాశాల్ని వినియోగించుకోండి!
ఆకాశం నుంచి జాలువారిన వర్షపు చినుకు
మురికికాలువలో పడితే కనీసం కాళ్లు కడుక్కోవడానికి
కూడా పనికిరాదు. అదే చినుకు ఆల్చిప్పలో పడితే
ముత్యంలా మెరుస్తుంది. చినుకు ఒక్కటే. కానీ
దేనితో కలుస్తుందనేది అస్తిత్వాన్ని నిర్దేశిస్తుంది.
కాబట్టి ముత్యాల్లా మారేందుకు మీరూ
సంకల్పించడండి. ఇలాంటి శిబిరాలను
వినియోగించుకోండి. ఈనెల 21 నుంచి పదో
తరగతి పరీక్షలు ప్రారంభం. ఫలితాల్లో పల్లె
ఆణిముత్యాలదే హవా కొనసాగాలని ఆశిస్తూ..
ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్!
లక్ష్యం చూపిన దారి!
వీళ్లంతా ఒకే పాఠశాల విద్యార్థులు కాదు. రంగారెడ్డి
జిల్లాలోని 37 మండలాల నుంచి కేవలం పదో తరగతి
పరీక్షల ప్రిపరేషన్ కోసం వచ్చిన విద్యార్థులు. అదీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పల్లె ఆణిముత్యాలు
మాత్రమే. వీళ్లను ఒకే చోటుకు చేర్చి రాత్రింబవళ్లు
చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పిస్తున్నది
జ్ఞాన సర్వసతీ ఫౌండేషన్. రంగారెడ్డిజిల్లా కేంద్రంగా
పనిచేసే ఈ సంస్థ రూరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను
బలోపేతం చేసి.. ప్రభుత్వ పాఠశాలల్ని.. ప్రభుత్వ
పాఠశాల విద్యా విధానాన్ని బతికించడమే
లక్ష్యంగా పెట్టుకున్నది. పదో తరగతి విద్యార్థులను
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ
సంవత్సరం ఈ ఫౌండేషన్ లక్ష్యం ప్రత్యేక
శిబిరం నిర్వహిస్తున్నది. భోజనం, అకామిడేషన్..
స్టడీ మెటీరియల్.. నిపుణులైన ఫ్యాకల్టీ..
గెస్ట్క్లాస్లు సమకూరుస్తూ రెట్టించిన ఉత్సాహంతో
శిబిరం నిర్వహిస్తున్నారు.
ఉన్నతంగా ఎదగాలి:

మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి.
ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే
ప్రపంచం ఎదరుచూసేలా మనం ఎదగాలి అనే మెండైన
ఆత్మవిశ్వాసం పిల్లలకు అందించాలనే లక్ష్యంతో ఈ
45రోజుల స్పెషల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ
పాఠశాలల్లో చదివే విద్యార్థులను సమాజమంతా
పేద పిల్లలు అంటుంది. కానీ వాళ్లను మేం పల్లె
ఆణిముత్యాలు అంటున్నాం. గ్రామీణ
విద్యాభివృద్ధి సాధించేందుకు సంవత్సరం
పొడవునా వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నాం.
ఇలాంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే కచ్చితంగా
ప్రభుత్వ పాఠశాలలు.. విద్యావిధానం మనుగడ
సాధిస్తాయి.
- సదా వెంకట్‌రెడ్డి,
జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
అమ్మకు మాటిచ్చా:
నాన్న రోజూ తాగి ఇంట్లో అల్లరి చేసేవాడు.
ఈ పరిస్థితి నాలో చాలా మార్పు తీసుకొచ్చింది.
ఈ 43 రోజులూ ఇంటికి దూరంగా ఉండి బాగా చదివా.
ఫైనల్ ఎగ్జామ్స్‌లో టాప్ స్కోర్ సాధిస్తానని అమ్మకు
మాటిచ్చా. కచ్చితంగా నెరవేరుస్తా!
- స్వప్న, మహేశ్వరం
రాళ్లు కొట్టే కుటుంబం:
మా నాన్న రాళ్లు కొడుతాడు. రాళ్లు కొట్టే వ్యక్తి
బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ కావొద్దా? కచ్చితంగా అవుతా.
పరీక్షలకు ఇంటివద్ద ప్రిపేరవలేం. డిస్టర్బెన్స్
అయ్యే అవకాశం ఉంది. క్యాంప్‌లో సెలెక్ట్
అవడం నా అదృష్టంగా భావిస్తున్నా.
- కావ్య, మొయినాబాద్
డాక్టర్నవుతా
పట్టణాల్లో.. కార్పోరేట్ స్కూళ్లలో చదివే వారికన్నా
ప్రభుత్వ బడుల్లో చదివేవాళ్లే నేర్పరులు. కిరాణషాపు
ద్వారానే నడిచే కుటుంబం మాది. అలాంటి నేను
పదిలో 10/10 సాధించి..
భవిష్యత్‌లో కచ్చితంగా డాక్టర్నవుతా.